News
శబరిమలైలో ఎపివాసుల అరెస్టు
కేరళలోని శబరిమలైలో ఐదుగురు తెలుగువారు అరెస్టు అయ్యారు. వారు అక్కడి బంగారు ద్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్లారు. వీరు తమ భక్తిలో భాగంగా, ఆలయంలో ద్వజస్తంభంపై పాదరసం చల్లారని, దాంతో అది స్వల్పంగా ద్వంసం అయిందని పోలీసులు గుర్తించారు. సిసిటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వారు కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందినవారు. వారి అరెస్టు సమాచారం తెలిసిన తర్వాత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. వారు కావాలని పాదరసం చల్లలేదని, భక్తిలో బాగంగానే చేశారని, ఇందులో విద్రోహం లేదని ఆయన వివరించారు. దాంతో చంద్రబాబు కూడా కేరళ డిజిపితో ,ఇతర ఉన్నతాదికారులతో మాట్లాడి వారిని విడిపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








